ఉస్తాద్ రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా కోసం అన్ని తానై దగ్గరుండి చూసుకుంటున్నాడు.సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా మ్యూజిక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు రామ్.సాంగ్స్ బాగుంటే సినిమాకు సగం ప్రమోషన్స్ జరిగినట్లే.దాంతో ప్రతి సాంగ్ మ్యూజిక్ సిట్టింగ్ కి హాజరువుతున్నాడు.రీసెంట్ ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రాగ ఆ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.దాన్ని రామ్ స్వయంగా రచించడం విశేషం.అనిరుధ్ వోకల్స్ అందించాడు.అందులోని లిరిక్స్ కూడా అర్ధవంతంగా వున్నాయి.తన ప్రేయసికి ప్రేమను వ్యక్త పరిచే సందర్భంలో వచ్చే ఆపాట మ్యూజిక్ యాప్స్ లలో ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అలా ఫస్ట్ అటెంప్ట్ లోనే రామ్ లిరిస్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసారి రామ్ సింగర్ గా మారాడు.ఆంధ్ర కింగ్ తాలూకా నుండి సెకండ్ సింగల్ వస్తుంది. ఫుల్ ఫన్ సాంగ్ గా పప్పీ షేమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 8న విడుదలకానుంది.ఇక ఈ సాంగ్ కోసం రామ్ వోకల్స్ అందించాడు.ఈ విషయాన్ని ఆంధ్ర కింగ్ టీం ఈరోజు సగం సగం రివీల్ చేసింది.రేపు రామ్ పేరును పూర్తి గా రివీల్ చేయనున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























