కొత్త లోక బ్రేక్ ఈవెన్ కంప్లీట్ 

Kotha Lokha Completes Break-Even in telugu states

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 – చంద్ర.ఈసినిమా తెలుగులో కొత్త లోక గా విడుదలైన విషయం తెలిసిందే.ఇక తెలుగు రాష్ట్రాలో ఈసినిమా నిన్నటి తో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది.ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఈసినిమాను తక్కువ ధరకు తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేయగా నిన్నటితో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.బయ్యర్లకు ఈసినిమా ఫుల్ రన్ లో మంచి లాభాలను అందించనుంది. వారం రోజుల్లో ఈసినిమా ఏపీ & తెలంగాణలో కలిపి 7 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కేరళ బాక్సాఫీస్ వద్ద ఈసినిమా కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఎక్కడా స్లో అవ్వకుండా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. నిన్నటితో ఈసినిమా కేరళలో 40కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.మొదటి వారంలోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల క్లబ్ లో చేరగా నిన్నటితో 120కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఈ వీకెండ్ తో 150కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో ఈజీగా ఈసినిమా 200కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఈరోజు ఈసినిమా హిందీలోకూడా రిలీజ్ అయ్యింది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాత గా వ్యవహరించిన ఈసినిమాను సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ తెరకెక్కించాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.