ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది కన్నడ సినిమా కాంతార.అన్ని భాషల్లో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బయ్యర్లు భారీ లాభాలను తీసుకొచ్చింది.దాంతో ఈసినిమాకు సీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు.డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిర్మాతలు కూడా భారీగా కోట్ చేస్తున్నారు.తెలుగు హక్కులకోసం 100 కోట్ల వరకు చెప్తున్నారట.డీల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హిందీ రైట్స్ మాత్రం సోల్డ్ అయ్యాయి. నార్త్ ఇండియా తోపాటు నేపాల్ లో ఈసినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏ ఏ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుంది.కాంతర హిందీ వెర్షన్ ను కూడా ఈసంస్థే రిలీజ్ చేయగా ఫుల్ రన్ లో 50 కోట్ల వరకు రాబట్టి భారీ లాభాలను మిగిల్చింది.దాంతో సీక్వెల్ కూడా రిలీజ్ చేయడానికి ఏ ఏ ఫిలిమ్స్ ముందుకొచ్చింది.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఫైనల్ కాపీని రెడీ చేసే పనిలో వుంది టీమ్.త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. అక్టోబర్ 2న కాంతార చాఫ్టర్ 1 థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























