కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ అవుతుంది.ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డ్యూడ్ దీపావళికి రిలీజ్ కానుందని మూవీ అనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు మేకర్స్.కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఇప్పుడు ఎల్ఐకె ఆ స్లాట్ తీసుకోవడంతో డ్యూడ్ వాయిదాపడుతుందని అందరు అందుకున్నారు. కానీ డ్యూడ్ నుండి కొన్ని రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి దీపావళికే రిలీజ్ అవుతుందని ట్విస్ట్ ఇచ్చారు. దాంతో ఒకే హీరో నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి ఎలా వస్తాయని గందరగోళం ఏర్పడింది.
అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో ప్రదీప్ రంగనాథ్ కొంత క్లారిటీ ఇచ్చాడు. నా రెండు సినిమాల్లో ఏదో ఒకటే దీపావళికి రిలీజ్ అవుతుందని వెల్లడించాడు. మరి ఇంతకీ ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో రానున్న రోజుల్లో తెలియనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























