నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైన్ర్ ‘ది ప్యారడైజ్’. ఇందులో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ నుండి ‘రా స్టేట్మెంట్’, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌తో అంచనాలని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ తో మేకర్స్ యూనివర్సల్ విజన్ అందరికీ అర్ధమైయింది.
మేకర్స్ ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమా విజన్‌తో చాలా గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నట్టు స్పష్టమైంది. దీంతో ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ ది ప్యారడైజ్‌ని ఇండియా నుంచి వచ్చే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా చెబుతున్నారు. 2026 మార్చిలో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ఈ నేపథ్యంలో ప్యారడైజ్ మూవీ నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ది ప్యారడైజ్ టీం హాలీవుడ్‌లోని ‘Connekkt Mob Scene’ ఎగ్జిక్యూటివ్ VP ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ ‘అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి’ని కలసి సినిమా కోసం కొలాబరేషన్ డిస్కస్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ వాళ్ల ఇంటర్నేషనల్ ప్లాన్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా ప్రజెంట్ చేస్తోంది. మొదటినుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమా లాగా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు.
మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ గ్లోబల్ మూవీ దిశగానే సాగుతున్నాయి. ఆగ్రెసివ్ ప్రమోషన్స్‌తో ఇప్పటి నుంచే అన్ని లాంగ్వేజెస్‌లో, మార్కెట్స్‌లో, ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇంటర్నేషనల్ వెర్షన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్ ని కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి టీం చర్చలు జరుపుతోంది.
ఇది ప్రాజెక్ట్‌కి ఇంకో గ్లోబల్ డైమెన్షన్‌ని జోడిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాటోగ్రఫీకి సి.హెచ్. సాయి, మ్యూజిక్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్‌కి నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌కి అవినాష్ కొల్లా పని చేస్తున్నారు.
కాగా ది ప్యారడైజ్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























