మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర.సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక రెండు రోజుల క్రితం మలయాళం విడుదలైన ఈసినిమా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకుని సత్తా చాటింది.2 రోజుల్లో కేరళ లో 6కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజు , రేపు ఇదే రన్ ను కొనసాగించనుంది. సో ఈ వారాంతం లో 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.ఇప్పటివరకు బుక్ మై షోలో 3 లక్షలకు పైగా టికెట్స్ తెగాయి.
ఇక ఈసినిమా తెలుగు లో కొత్త లోక గా నిన్న రిలీజ్ కాగా ఇక్కడ కూడా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో ఈరోజు ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకోనుంది. మల్టీ ఫ్లెక్స్ లలో షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి.రేపటి తో ఈజీగా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.ఈసినిమా తనకు ఫుల్ రన్ లో మంచి లాభాలను తీసుకురానుంది. జేక్స్ బిజోయ్ ఈసినిమాకు సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలకపాత్రలో నటించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























