రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ నుండి ‘ఏం జరుగుతోంది’ సాంగ్ రిలీజ్

The Girl Friend Second Single Em Jaruguthondhi Released

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ ‘నదివే..’ మంచి స్పందన పొందింది. దీంతో రెండవ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇప్పుడు మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఏం జరుగుతోంది’ అంటూ సాగే ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా.. చిన్మయి శ్రీపాదతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వయంగా ఆలపించారు. దీనికి హేషమ్, మంచి మెలోడీ ట్యూన్ అందించారు. దీనిని ఫీల్-గుడ్ లవ్ సాంగ్‌గా రూపొందించాడు దర్శకుడు.

ఇక ఈ పాట విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఒక మంచి మెలోడీ లవ్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ పాటతో ఒక గొప్ప విందుని అందించినట్టయింది. కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక సరసన ‘దసరా’ ఫేమ్ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.