ప్రతినిధి 2 తరువాత నారా రోహిత్ సోలో హీరోగా నటించిన సినిమా సుందరకాండ. రేపే థియేటర్లోకి రానుంది.రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వస్తుంది.ఇండస్ట్రీ సర్కిల్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది.సామజవరాగమన లాంటి సినిమా ఇదని కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్. సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తుంది సుందరకాండ టీం.సినిమా మీద వున్న నమ్మకంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది.దాంతో విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుందరకాండలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు అదిరిపోనున్నాయట. ఎవరు ఊహించని ట్విస్ట్ ఉండనుందట. దర్శకుడు కథను నడిపించిన తీరు బావుందట. కథతో పాటు కామెడీ ఉండటం సినిమాకు మెయిన్ ప్లస్ అంటున్నారు.సత్య – సునైనా జోడీ బాగా నవ్విస్తుందట. అలాగే అభినవ్, వాసుకి, నరేష్ విజయ కృష్ణ, రూపలక్ష్మి సన్నివేశాలు సైతం బాగా వచ్చాయట.
సుందరకాండకు షార్ట్ రన్ టైం కూడా కలిసిరానుంది. సినిమా నిడివి 2.15 గంటలు మాత్రమే.వెంకటేష్ నిమ్మలపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ , వృతి వాఘాని హీరోయిన్లు గా నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మించారు.
ఇక నారా రోహిత్ హిట్ కొట్టడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.దాదాపు సోలోగా రిలీజ్ అవుతుండడం దానికి తోడు వినాయక చవితి హాలిడే కావడం అడ్వాంటేజ్ కానుంది. రోహిత్ అయితే సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. సుదరకాండతో కం బ్యాక్ పక్కా అంటున్నాడు.మరి రిజల్ట్ ఏంటో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































