మాస్ జాతర రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

Mass Jathara Postponed, New Release Date Will Be Announced Shortly

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ జాతర విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా, ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది చిత్ర యూనిట్. షూటింగ్‌లో కొంత ప్యాచ్‌వర్క్ మరియు ఒక పాట చిత్రీకరణ ఇంకా మిగిలి ఉండటమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

వాయిదాకు కారణాలు..

ఈ మేరకు సితార సంస్థ సోషల్ మీడియా వేదికగా.. “ఇటీవలి పరిశ్రమ వ్యాప్తంగా సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్‌ను పూర్తి చేయడంలో ఊహించని జాప్యాల కారణంగా, ‘మాస్ జాతర’ ఆగస్టు 27న జరగడం లేదు. కానీ త్వరలో థియేటర్లలో అతిపెద్ద మాస్ విందును మీకు అందించడానికి బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది! కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపింది.

అభిమానుల్లో నిరాశ..

అయితే మరోవైపు మాస్ జాతర సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌, రెండు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తేదీ కూడా దగ్గరపడటంతో ప్రమోషన్స్ ఊపందుకుంటాయని ఆశించారు. కానీ అనూహ్యంగా సినిమా వాయిదా పడటంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. అయితే, సినిమా పూర్తి అవుట్‌పుట్ సంతృప్తికరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది మంచి పరిణామమే అని కొందరు విశ్లేషిస్తున్నారు.

కొత్త విడుదల తేదీ ఎప్పుడు?

మాస్ జాతర కొత్త విడుదల తేదీ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు చివరి కాపీని చూసిన తర్వాతే ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో దాదాపు అన్ని స్లాట్స్ ఫిల్ కావడం, అలాగే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కూడా రానుండటంతో, ఈ మూవీ విడుదల అక్టోబర్‌లోనే ఉండే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం రవితేజ అభిమానులు వేచి చూడక తప్పదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.