300 కోట్ల క్లబ్ లో మహావతార్ నరసింహ

Mahavatar Narsimha Joins the 300 Crore Club

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ విడుదలై నెల రోజులకు పైగా అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుంది. కొత్తగా విడుదలైన సినిమాలు స్లో అవుతున్నాయి కానీ మహావతార్ మాత్రం వర్కింగ్ డేస్ లోకూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది. దాంతో ఈసినిమా నిన్నటితో 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈసినిమా బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. రేపు వినాయక చవితి హాలిడే కావడంతో ఇదే జోరు కొనసాగించనుంది.విడుదలైన అన్ని భాషల్లో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి భారీ లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా
హిందీలో అయితే ఇప్పటికీ అదరగొడుతుంది.కొత్త సినిమాలతో పోటీని తట్టుకొని మరీ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో హిందీ వెర్షన్ 175 కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక తెలుగులోనూ ఈసినిమా భారీ లాభాలను తీసుకొస్తుంది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశారు.సినిమా ఊహించని విధంగా సక్సెస్ కావడంతో శాటిలైట్ , ఓటిటి రైట్స్ కు భారీ డిమాండ్ వుంది.

విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా  సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.