వినాయక చవితి కానుకగా.. థియేట‌ర్ల లోకి రాబోతున్న చిత్రాలివే..!

Vinayaka Chavithi Special Sundarakanda, Kanya Kumari, Tribanadhari Barbarik Releasing in Theatres

తెలుగునాట ఏదయినా పండుగ వచ్చిందంటే.. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. దీంతో సినిమా ప్రియులకు, ప్రేక్షకులకు డబుల్ బొనాంజా అందుతుంది. ఈ కోవలోనే ఈసారి వినాయక చవితి పండుగ సందర్భంగా, రేపు, అంటే ఆగస్టు 27న తెలుగు థియేటర్లలో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద హీరోల చిత్రాలు కానప్పటికీ, ఈ సినిమాలు వేర్వేరు జానర్లలో ఉండటం విశేషం. వాటిలో ‘సుందరకాండ’, ‘కన్యాకుమారి’ మరియు ‘త్రిబాణధారి బార్బరిక్’ ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

  1. సుందరకాండ..

నారా రోహిత్ హీరోగా, వృతి వాఘని హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో జూనియ‌ర్ శ్రీదేవి కీల‌క పాత్ర‌ను పోషించింది. సెన్సార్ నుండి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడదగినది. కామెడీ, డ్రామా, మరియు రొమాంటిక్ అంశాలతో ప్రేక్షకులను అలరించనుంది. నారా రోహిత్ నటన, డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి కథనంపై మంచి అంచనాలు ఉన్నాయి. సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మించారు.

  1. కన్యాకుమారి..

గీత్‌ షైని టైటిల్ పాత్రలో, శ్రీచరణ్‌ రాచకొండ హీరోగా నటించిన ఈ సినిమాను సృజన్‌ అట్టాడ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించాడు. శ్రీచరణ్‌ రైతుగా, గీత్‌ షైని ఐటీ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు, భావాలు, వైరుధ్యాలు వాటి చుట్టూ అల్లుకున్న హృద్యమైన ప్రేమకథతో తెరకెక్కింది. పాపులర్ నటి మధుశాలిని సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఈ మూవీతో నిర్మాతగా మారడం విశేషం.

  1. త్రిబాణధారి బార్బరిక్..

వర్తమాన సంఘటనలకు పౌరాణిక నేపథ్యాన్ని జోడించి తెరకెక్కిన ఈ సినిమాలో ‘కట్టప్ప’ సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌. సింహా ప్రధాన పాత్రల్లో న‌టించారు. విజయ్‌పాల్‌ రెడ్డి అడిదెల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. ఇందులోని పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా వినాయక చవితి కానుకగా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతానికి ఈ మూడు సినిమాలు వినాయక చవితికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక పక్క పండుగ వాతావరణం, మరో పక్క కొత్త సినిమాల జోష్.. ఈ కాంబినేషన్ సినిమా ప్రియులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ మూడు సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. అలాగే ఈ మూడు చిత్రాలతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన హిందీ ఫిల్మ్ ‘పరం సుందరి’ కూడా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. దీనిపైనా మంచి అంచనాలు ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.