ఓజీ చెప్పిన తేదీకే

వచ్చే నెలలో మచ్ అవైటెడ్ మూవీగా వస్తుంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ ఆ హైప్ ను మరింతగా పెంచేసింది.సెప్టెంబర్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే షూటింగ్ ఇంకా అవ్వలేదని మరో 6 రోజుల ప్యాచ్ వర్క్ ఉందని కొద్దీ రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. దాంతో సినిమా విడుదల వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే పలు సార్లు వాయిదాపడుతుందని వార్తలు రాగ ఓజీ టీం క్లారిటీ ఇస్తూనే వస్తుంది.ఇక మరో సారి ఇలాంటి వార్తలు రావడంతో ఈరోజు సోషల్ మీడియా వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఇక తెర వెనుక ఎలాంటి యాక్షన్ లేదు.సినిమా లాక్ & లోడెడ్ .చెప్పిన తేదీ ప్రకారం 25న పక్కాగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. సో ఓజీ రావడం పక్కా.

ఇక అదే రోజున బాలకృష్ణ అఖండ 2 కూడా విడుదలవుతుందని ప్రకటించారు.అయితే ఈసినిమా కూడా వాయిదాపడుతుందని వార్తలు వస్తున్నాయి.ఇప్పటివరకు అయితే ఈవార్తలపై మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ అఖండ 2 వాయిదాపడితే ఓజీకి అడ్వాంటేజ్ కానుంది.

ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా శ్రీయా రెడ్డి ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.