మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.అయితే ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల ఈసినిమా షూటింగ్ కి ఆటంకాలు తప్పలేదు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 28న స్టార్ట్ కానుంది.వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కొద్దీరోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
ఈసినిమా ఎక్కువ భాగం షూటింగ్ ముంబై లోనే జరుగనుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ను హీరోయిన్ గా నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ను ఖరారు చేయాల్సివుంది.వచ్చే ఏడాదిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా కావడంతో AA 22 x A 6 పై భారీ అంచనాలు వున్నాయి.కుదిరితే వచ్చే నెలలో ఈసినిమా నుండి అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























