సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిపోవడంతో ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు గాను కింగ్డమ్ ఓటీటీ హక్కులను తీసుకుంది.వినాయక చవితి సందర్భంగా ఈనెల 27న ఈసినిమా ఓటీటీ లో విడుదలకానుంది.తెలుగు , తమిళ ,కన్నడ ,మలయాళ భాషలతో పాటు హిందీ లోనూ అదే రోజు స్ట్రీమింగ్ లోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ డ్రామాగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు. నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మించారు. వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ ఎట్టకేలకు హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.
ఇక విజయ్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా తన 14వ సినిమాను టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్నాడు.ఈపాటికే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సిఉండగా ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల ఆలస్యం అయ్యింది. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అజయ్ -అతుల్ సంగీతం అందిస్తున్నారు.
ఇక విజయ్ తన 13వ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలాతో చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.విజయ్ ఈరెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























