ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

Producer Naga Vamsi Responds Over Trolls on Him in Social Media

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను తీస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ గురించి ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఆయన మాటతీరు కొంచెం ముక్కుసూటిగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందని సినీ జనాలతోపాటు మూవీ లవర్స్ అభిప్రాయం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన మాటలు, వ్యవహారశైలి అప్పుడప్పుడు చర్చనీయాంశం అవుతుండటం గమనించొచ్చు. దీంతో నాగవంశీని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అయితే వీటిని ఆయన కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటుంటారు. అప్పుడప్పుడు తిరిగి కౌంటర్లు కూడా ఇస్తుంటారు.

ఇప్పుడు ఇదే తరహాలో ఆయనపై గత వారం రోజులుగా కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమాని అయిన నాగవంశీ ఇటీవల వార్ 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించినంతగా వసూళ్లు అందుకోవడంలేదు. ఈ క్రమంలో వంశీ దుబాయ్ వెళ్లిపోయారు అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆయన స్పందించారు.

ఈ మేరకు నాగవంశీ ఎక్స్ వేదికగా “ఏంటి నన్ను చాలా మిస్ అవుతునట్టు ఉన్నారు.. వంశీ ఆది, వంశీ ఇది అని గ్రిప్పింగ్ కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది.. పర్లేదు, ఎక్స్ లో మాంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్నందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి, కానీ ఇంకా ఆ సమయం రాలేదు.. కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంది. సినిమా థియేటర్లలో… సినిమా కోసం, ఎల్లప్పుడూ! మా తదుపరి మాస్ జాతరతో మీ అందరినీ కలుద్దాం, అతి త్వరలో!” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.