వెంకీ -కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

#VenkyAnil5 (#NKRAR2) Wraps Up Its First Schedule

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌లో నిర్మించారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్ కృతి శెట్టి షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ షెడ్యూల్‌లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు. చాలా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.

ఇప్పటికే విడుదల చేసిన కళ్యాణ్ రామ్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిల్ రావిపూడి తనదైన క్రియేటివ్ ప్రమోషన్స్ ఇప్పటికే అంచనాలు పెంచారు.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది.

ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం పని చేస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

VenkyAnil5 / #NKRAR2 అనిల్ రావిపూడి మార్క్ వినోదం, కుటుంబ భావోద్వేగాలు, ఫెస్టివల్ ట్రేడ్‌మార్క్ ఎంటర్టైనర్. ఈచిత్రం 2027 సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.