కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ1 ని. చదువు

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Nagabandham Arrives on OTT

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఎలాంటి ముందస్తు సందడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

అభిషేక్ నామా దర్శకత్వంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్‌తో నిర్మితమైన ఈ చిత్రం జూలై 3న థియేటర్లలోకి వచ్చి డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా సరిగ్గా 21 రోజుల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

కథ

భారతీయ ఆధ్యాత్మికత, పురాణాలు మరియు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని దాగిన గుప్త నిధుల రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అత్యంత శక్తివంతమైన దైవిక నిధిని దక్కించుకోవాలని చూసే దుష్టశక్తులకు, దానిని కాపాడటానికి సిద్ధపడే హీరో మరియు నాగ సాధువులకు మధ్య జరిగే పోరాటమే ఈ 'నాగబంధం'.

జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మైథలాజికల్ ఫాంటసీ డ్రామాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్