ప్రామిసింగ్ యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ‘చాయ్ వాలా’. నవాబ్ అనే టీ–కేఫ్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ కీలకమైన టీజర్ ను విడుదల చేశారు. యూఎస్ వెళ్లాలను హీరో , మరోవైపు టీ–కేఫ్ నే నమ్ముకున్న తండ్రి , మధ్యలో హీరో–హీరోయిన్ లవ్ ట్రాక్, ఫన్ ఎలిమెంట్స్ తో పాటు చివర్లో ఎమోషనల్ సన్నివేశాలతో టీజర్ ను ఫుల్ ప్యాక్డ్గా కట్ చేశారు. మొత్తం మీద ఈ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతోంది.
సినిమా మేకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























