యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ‘కొంచెం కొంచెం’ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ‘కొంచెం కొంచెం’ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. పాటలోని రొమాంటిక్ మూడ్‌ను అందంగా ప్రజెంట్ చేసిన ట్యూన్‌తో పాటు, మ్యూజిక్ అరేంజ్మెంట్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. సమీరా భరద్వాజ్ తన మెలోడీ వోకల్స్ తో పాటలోని భావాలను మరింత అందంగా పలికించారు.
ఈ పాటలో హవీష్, కావ్యా థాపర్ మధ్య కనిపించే రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ స్పెషల్ అప్పియరెన్స్‌తో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆమె గ్లామర్‌తో పాటు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ కూడా పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆకట్టుకునే ట్యూన్, సరదా సాహిత్యం, మెలోడీ వోకల్స్, స్టైలిష్ విజువల్స్‌తో ‘కొంచెం కొంచెం’ పూర్తి స్థాయి రొమాంటిక్ సాంగ్‌గా అలరిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























