నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్.దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇందులో నాని ఇంతకుముందెన్నడు లేని విధంగా కనిపించనున్నాడు.ఇప్పటికే రెండు పోస్టర్లు విడుదలకాగా వాటితో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈరోజు మేకింగ్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో జైల్లో తీసిన యాక్షన్ సన్నివేశాలను చూపించారు.ఈ మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది సినిమా ఏ రేంజ్ లో వుండబోతుందనేది.ఇందులో నాని హిట్ 3లో కన్నా మరింత వైలెంట్ గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ కీలక పాత్రలో నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.ది ప్యారడైజ్ దక్షిణాది భాషలతో పాటు హిందీ ,బెంగాలీ ,ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ఇక దసరా నుండి నాని తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తున్నాడు.దసరా తరువాత హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ అందుకోగా రీసెంట్ గా హిట్ 3 తో వచ్చి కెరీర్ లో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరి ది ప్యారడైజ్ తో నాని ఫామ్ కంటిన్యూ చేస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























