100 కోట్ల క్లబ్ లో కింగ్డమ్

Kingdom Joins the 100 Crore Club

హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోగా నిన్నటి తో 100కోట్ల మైలు రాయిని చేరుకుంది. మొదటి రోజు అయితే ఏకంగా 39కోట్ల వసూళ్ళతో అదరగొట్టింది.ఆతరువాత కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.అయితే ఈసినిమాకు తెలుగులో వేరే సినిమాలతో పెద్దగా పోటీ లేదు కానీ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ మాత్రం గట్టి పోటీనిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ డ్రామాగా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈసినిమాలో  భాగ్య శ్రీ  బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.అనిరుధ్ సంగీతం అందించగా నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మించారు. ఇక వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.

ఇక విజయ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు వున్నాయి. అందులో తన 13వ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోలాతో చేయనుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.అలాగే తన 14వ సినిమాను టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్నాడు.ప్రస్తుతం ఫెడరేషన్ స్ట్రైక్ లేకుంటే ఈసినిమా గత వారమే స్టార్ట్ అయ్యి ఉండేది.ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అజయ్ -అతుల్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.