శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ లాక్

Siva karthikeyan’s Next Movie Locked

గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.అందులో భాగంగా ఇప్పటికే మదరాసి కంప్లీట్ చేశాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులోరుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సెట్స్ మీద ఉండగానే శివ కార్తికేయన్ తన 25వ సినిమా పరాశక్తి షూటింగ్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈసినిమా కూడా ఫైనల్ స్టేజ్ లో వుంది. సెప్టెంబర్ లో కంప్లీట్ కానుంది.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ కూడా లాక్ అయ్యింది.వెంకట్ ప్రభు డైరెక్షన్ లో శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఇందులో శివ కార్తికేయన్ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఫుల్ ఫన్ ఎంటర్టైనెర్ గా ఈసినిమా రానుంది.త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. తాజాగా ఈవిషయాన్ని వెంకట్ ప్రభు కూడా కన్ ఫర్మ్ చేశాడు. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.