మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ కె – ర్యాంప్ తో రానున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఓనమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 9న విడుదలకానుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది.
ఇందులో యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న సినిమా థియేటర్లోకి తీసుకురానున్నారు. ఇక గత ఏడాది క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టిన కిరణ్ ఆ తరువాత దిల్ రుబాతో నిరాశపరిచాడు.ఇక ఈసారి కె – రాంప్ తో హిట్ కొట్టి ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నంబూరి రవి డైరెక్షన్ లో ప్రేమ కథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























