దేశమంతటా ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు – తేజ సజ్జా 

Megastar Chiranjeevi garu is the first person we think of when it comes to blood donation in the entire nation says Teja Sajja

 79వ స్వాత్రంత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే  సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహించిన  రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం.  ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సురేష్ చుక్కపల్లి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ఒక ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. తప్పకుండా అందరూ బ్లడ్ డొనేట్ చేయండి. ప్రాణాల్ని కాపాడండి. బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి గారిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారితో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రక్త దాతలందరికీ ధన్యవాదాలు’అన్నారు

అలాగే హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన  నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయనతో ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది రక్తదానం చేయడానికి మూల కారణమైన చిరంజీవి గారికి ధన్యవాదాలు. రక్తదానం ఒక ప్రాణం నిలబెడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.