రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను –  మెగాస్టార్ చిరంజీవి

salute with deep respect all those who donate blood says Chiranjeevi

79వ స్వాత్రంత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే  సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహించిన  రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు అత్యంత ఆప్తుడైన సురేష్ చుక్కపల్లి గారు వారు చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు గత రెండేళ్లుగా ఈ బ్లడ్ డొనేషన్ కూడా మొదలుపెట్టి నా హృదయానికి మరింత దగ్గర అయ్యారు. ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు సురేష్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేయడమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డ లాంటి తేజ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు తన ఎన్నోసార్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంయుక్త గారికి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవికి మిగతా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. దాని వలన ఒక ప్రాణం నిలబడుతుంది. నేను ఇది ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్. రక్తదానం గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ కొత్త జనరేషన్ కొత్త యువత వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. 


ఒక జర్నలిస్ట్‌ రాసిన ఆర్టికల్‌ చదివిన తర్వాతే నాకు బ్లడ్‌ బ్యాంక్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. దాదాపు 27 ఏళ్ల క్రితం రక్తం దొరకక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తర్వాత ఎందుకు రక్తం దొరకడం లేదు అనే ఒక ఆలోచన నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది. మన అభిమానుల్ని  బ్లడ్ డొనేషన్ వైపు మళ్లించగలిగితే గనుక ఒక అత్యంత శక్తివంతమైన సామాజిక సేవ వైపు నడిపినట్లుగా ఉంటుందని, దాని ద్వారా వారికి కూడా ఒక మంచి సంతృప్తి వస్తుంది కదా, ఒక మంచి పనికి నాంది పలికిన వాడిని అవుతానని ఆరోజు ఇచ్చిన పిలుపు.. ఈరోజు లక్షల మంది రక్తదానం వైపు కదిలించింది. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. రక్తదానం అనగానే నా పేరు స్ఫురించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం గా భావిస్తున్నాను. ఎన్నో జన్మలుగా చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక పొలిటీషియన్ నాపై అకారణంగా అవాకులు చవాకులు పేలారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే  అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురుతిరిగింది. ‘చిరంజీవిని అన్నన్ని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది’ అని నిలదీసింది. ఆ వీడియో చూసి ఆమె గురించి వివరాలు కనుక్కొన్నాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిపింది. ఆ మాటలు నా మనసుని టచ్ చేశాయి. విమర్శలపై ఎందుకు స్పందించరు అని నన్ను అందరూ అడుగుతారు. నేనెప్పుడూ స్పందించను. ఎందుకంటే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. ఆ మహిళ మాట్లాడిన తర్వాత సదరు రాజకీయ నాయకుడు ఎక్కడా నా గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది కదా. ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా… ఇంటికి వెళ్లాక వాళ్ల భార్య అయినా మరోసారి ఇలా మాట్లాడొద్దు అని చెబుతుంది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికీ స్పందించను. మంచి చేసుకుంటూ వెళ్తాను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను. ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా నా మాటను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేస్తున్నారు. వాళ్లందరికీ అభినందనలు. ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసిన నా మిత్రుడికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా నన్ను పిలవండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. అందరికీ ధన్యవాదాలని అన్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.