హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అల్లు అరవింద్ గారితో ఎప్పుడు కలిసిన ఒక అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా గురించి వారు చెప్పటం, ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడటం జరిగింది. మాకు ఒక సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే మేము ఒక గుడిలో ఉన్నామని భావన కలిగించిన సినిమా ఇది. సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతుందా అనంత గొప్ప అనుభూతిని ఇచ్చింది.”
“దర్శకుడు అశ్విన్ ఈ సినిమాతో యావత్ ప్రపంచానికి విష్ణుమూర్తిని, నరసింహ స్వామిని దర్శనం చేయించేశారు. ఈ సినిమా చూడటం పూర్వజన్మల పుణ్యం. ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూసినా ఒక కొత్త అనుభూతి. పరిపూర్ణమైన సినిమా ఇది. అంత పెద్ద నరసింహుడిని నా జీవితంలో చూసి ఎరగను. స్క్రీన్ అంతా నిండిపోయింది. ఒక ఉద్వేగానికి లోనైపోయాం. ఇది రసాత్మకం కళాత్మకం. ఇది తీసిన వారు, రాసిన వారు, చేసిన వారు, చూసినవారు.. అందరూ ధన్యులే. జై నారసింహ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























