మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“తన కుటుంబాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి విశ్వాసాన్నే తన అతిపెద్ద ఆయుధంగా మార్చుకుని చేసే ప్రయాణమే ఈ సినిమా” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.ఈసినిమాతో రవితేజ కం బ్యాక్ ఇవ్వడం పక్కా అనేలా ట్రైలర్ కట్ చేశారు.
ఆల్కహాల్ వ్యసనం ఉన్న తండ్రిగా, కూతురి కోసం 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించి జీవితాన్ని మార్చుకునే పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. తండ్రీ-కూతుళ్ల అనుబంధం మరియు ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ కీలక పాత్రల్లో మెరిశారు.మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























