మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ‘కొరియన్ కనకరాజు’ మీ అందరికీ నచ్చి మంచి విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెదనాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని మంచి విలువలు, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో పెంచారు. ‘కొరియన్ కనకరాజు’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఈ సినిమాకు కావాల్సిన ప్రతి విషయాన్ని సమకూర్చిన మా నిర్మాత రాజీవ్ గారికి, వంశీ అన్నకి, యూవీ క్రియేషన్స్ టీమ్‌కి బిగ్ థాంక్స్. గాంధీ నన్ను చాలా కొత్తగా చూపించారు. రితిక చాలా మంచి కోస్టార్. సత్య షూటింగ్ కారణంగా ఈ వేడుకకు రాలేకపోయాడు. మేమిద్దరం ఈ సినిమా కోసం బ్రదర్స్‌లా కలిసి పనిచేశాం. సత్య ఈ సినిమాకు చాలా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ పెదనాన్న, బాబాయ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పెదనాన్న, అమ్మానాన్న కళ్లల్లో ఎప్పుడూ గౌరవం కనిపించాలి. బాబాయ్ కళ్లల్లో, అన్నయ్య కళ్లల్లో ఆనందం చూడాలి. ఇప్పుడు నేను ఈ మూడు విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మెగా ఫ్యాన్స్‌కి మంచి సినిమా ఇవ్వాలనేది నా ఆలోచన. ఈ సినిమా ద్వారా మీకు ఆనందాన్ని ఇచ్చాననే సంతోషంలో ఉన్నాను. ఆగస్టు 22 నాకు నేషనల్ హాలిడే లాంటిది. ఆ రోజు నేను పెదనాన్న గారి ఇంటికి వెళ్లిపోయేవాడిని. కొరియన్ కనకరాజు విజయంతో ఈ ఆగస్టు నాకు ఇంకా పెద్దది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే డాడీ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























