హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ… “జై నరసింహ స్వామి. జై జై సనాతన ధర్మం. ఇది సినిమా కాదు ఒక మహాదర్శనమని ప్రేక్షకులే చెబుతున్నారు. ఈ సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మనందరిలో ఒక డివైన్ ఫీలింగ్ కలిగించిన సినిమా ఇది. అలాంటి డివైన్ ఫీలింగ్ కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తీయడం జరిగింది. ప్రేక్షకులు అలాంటి ఫీలింగ్ పొందడం చాలా ఆనందాన్నిచ్చింది. గీతా ఆర్ట్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. వారి సపోర్ట్ తోనే సినిమా పబ్లిక్ లోకి వెళ్ళింది. ఈ సినిమా ఒక రెవల్యూషన్ కానుంది. అందరికీ థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























