జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి సహా ప్రముఖుల అభినందనలు

71st National Film Awards Megastar Chiranjeevi and Other Celebs Congratulates Winners

తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు పురస్కారాలు పొందిన నటీనటులు మరియు టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉత్తమ నటన, కథా రచన, సాంకేతిక నైపుణ్యం వంటి విభాగాల్లో విజేతలు గొప్ప ప్రతిభను ప్రదర్శించారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఇది భారతీయ సినిమా విజయోత్సవం” అని ఆయన పేర్కొన్నారు. ఇక తన సహచర నటుడు, మిత్రుడైన నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ జాతీయ అవార్డు గెలుచుకోవడంపై చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

అలాగే సీనియర్ హీరోలు కమల్ హాసన్, వెంకటేష్, నటుడు విష్ణు మంచు సహా పలువురు సినీ ప్రముఖులు కూడా నేషనల్ అవార్డు విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. సినీ పరిశ్రమ మొత్తంగా ఈ అవార్డుల పట్ల ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఇక ఈ జాతీయ పురస్కారాలు ఇండియన్ సినిమా ప్రతిష్టను మరింతగా పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.