ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహా నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచినందుకు బాలకృష్ణను వారు అభినందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా, సమాజానికి స్పూర్తిదాయకమైన కథాంశం, బాలకృష్ణ వేసిన శక్తివంతమైన పాత్ర చిత్రణ ఈ అవార్డుకు కారణమని నేతలు ప్రశంసించారు. బాలకృష్ణ పోషించిన పాత్ర సామాజికంగా ప్రభావవంతమైనదని, ఆయనకు ఇది మరో మైలురాయి అవుతుందని వారు పేర్కొన్నారు. అలాగే చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ మరియు సాంకేతిక బృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా ప్రకటించిన 71వ నేషనల్ అవార్డులలో మరికొన్ని తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ‘హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు’ వంటి చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజేతలను హృదయపూర్వకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























