పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇక ఈ సాంగ్ అంచనాలకు తగ్గట్లే వుంది.తెలుగు ,ఇంగ్లీష్ లిరిక్స్ తో ఫైర్ స్ట్రోమ్ అంటూ వచ్చిన ఈసాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం.తమన్ ,శింబు ,నజీరుద్దీన్ ,భరత్ రాజ్ దీపక్ బ్లూ ,రాజా కుమారి వోకల్స్ అందించగా విశ్వ , శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించారు.ఇంగ్లీష్ లిరిక్స్ ను రాజా కుమారి రచించారు.తమన్ మిక్సింగ్ అదరగొట్టాడు.లిరికల్ వీడియో లో పవన్ షాట్స్ అరాచకం అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా ఈసాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇక సినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతు న్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
హిట్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిచేసుకుంది.అన్ని ఏరియాల్లో భారీ బిజినెస్ చేసింది.ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థం లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























