ఓటీటీ లోకి వచ్చేసిన తమ్ముడు

Nithiin's Thammudu Now Streaming on OTT, Watch on Your Favorite Platform

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించగా.. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయ్ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ జూలై 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, నితిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ టచ్‌తో కూడిన కథనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇది తెలుగు సహా అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంది.

ఇక థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల దగ్గరకి మరింతగా చేరువవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చే విధంగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటిలోనూ మంచి వ్యూస్ రాబడుతోంది. థియేటర్‌కి వెళ్లి చూడలేకపోయిన వారికి ఇది ఒక మంచి అవకాశం. నితిన్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశాన్ని వినియోగించుకోండి.

కథ:-

కథానాయకుడైన జై (నితిన్) మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లిదండ్రులు, సోదరి స్నేహలత (లయ)తో కలిసి జీవిస్తుంటాడు. ఈ క్రమంలో స్నేహలత ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకోవలసి వస్తుంది. ఈ సమయంలో సోదరుడు జై తనకు అండగా నిలుస్తాడని ఆమె భావిస్తుంది. అయితే జై మౌనంగా ఉండి ఆమెను నిరాశపరుస్తాడు. దీంతో తమ్ముడి తీరుకి గుండె పగిలిన స్నేహలత ఇల్లు వదిలి వెళ్లి, అతన్ని మళ్ళీ చూడనని శపథం చేస్తుంది.

కొన్ని సంవత్సరాల తరువాత, వైజాగ్‌లో జరిగిన ఒక బాంబు పేలుడు నగరాన్ని కుదిపేస్తుంది. ఇందులో ప్రమేయమున్న ఒక ఫ్యాక్టరీ యజమాని ప్రభుత్వ అధికారులను బెదిరిస్తాడు. తనకు అనుకూలంగా నకిలీ నివేదికను సమర్పించమని వారిపై ఒత్తిడి తెస్తాడు. అయితే ఈ బృందంలో నిజాయితీగల అధికారిణి అయిన స్నేహలత ఈ కేసుకు నియమించబడిన వారిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైజాగ్ చుట్టుపక్కల అడవులలో జరిగే ఒక జాతరను వీక్షించేందుకు స్నేహలత కుటుంబంతో కలిసి ఆ గిరిజన గ్రామానికి వెళ్తుంది. ఇదే సమయంలో ఆమె ఇచ్చే రిపోర్ట్ వలన వలన తనకు ప్రమాదం ఉందని గ్రహించిన విలన్, కల్పిత నివేదికపై సంతకం చేయాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే, ఆమె మొత్తం కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తాడు.

ఇక్కడినుంచి మిగిలిన కథ మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. విషయం తెలుసుకున్న జై తన సోదరి కుటుంబాన్ని రక్షించడానికి సిద్దమవుతాడు. అయితే జై ప్రయత్నం ఫలించిందా? విలన్ బారినుంచి తన సోదరిని, ఆమె ఫ్యామిలీని సేవ్ చేయగలిగాడా? అభిప్రాయ భేదాలతో విడిపోయిన అక్క-తమ్ముడు మళ్ళీ కలిసిపోయారా? అన్నదే మిగతా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.