విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్డమ్’. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లు సాధించింది. తొలి ఆట నుంచే థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా కింగ్డమ్ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర అమెరికాలో మొదటి రోజే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు (సుమారు ₹8 కోట్లు) గ్రాస్ వసూలు చేసి, ఓపెనింగ్ డే రికార్డు నమోదు చేసింది. అలాగే ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.39 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న హైప్‌కు తగ్గట్లే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా అన్ని భాషల్లో మంచి టాక్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టోటల్ రన్‌లో ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లు అందుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవర్‌ఫుల్ కథ, బ్రదర్ హుడ్ డ్రామా, విజయ్ దేవరకొండ స్టైలిష్ నటన, అద్భుతమైన మ్యూజిక్.. ఇవన్నీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇక కింగ్డమ్ తొలిరోజు వసూళ్లతో విజయ్ దేవరకొండ తన స్టార్‌డమ్ స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ఇటీవల ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నా, తాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్సే ప్రూవ్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండకి ఇది మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఈ వీకెండ్‌కి కింగ్డమ్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే ఆయన కెరీర్‌లో ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవనుంది.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























