కింగ్డమ్ రివ్యూ

kingdom review in telugu

నటీనటులు : విజయ్ దేవరకొండ ,భాగ్య శ్రీ బోర్సే ,సత్యదేవ్ ,వెంకటేష్
ఎడిటింగ్ : నవీన్ నూలీ
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధర్ ,జొమాన్ జాన్
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు : నాగ వంశీ , సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ హడావిడి స్టార్ట్ అయ్యింది. గత వారం ఇదే రోజున పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు థియేటర్లలోకి రాగా ఈరోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదలైంది. విజయ్ కి తోడు , జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నునూరి , అనిరుధ్ , నాగవంశీ ఇలా ఇంట్రెస్టింగ్ కాంబో కావడంతో సినిమాపై ముందునుండి అంచనాలు వున్నాయి.ఆ తరువాత ట్రైలర్ , సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి ఈ కింగ్డమ్ కథేంటి ఈసినిమాతో విజయ్ కం బ్యాక్ ఇచ్చాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

సూరి (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ కానిస్టేబుల్. అనుకోకుండా అతను ఓ గూఢచారి మిషన్‌లో ఇరుక్కుంటాడు. మిషన్ లోకి వెళ్లిన తర్వాత, ఆ మిషన్ కి అతని తప్పిపోయిన సోదరుడు శివ (సత్యదేవ్)తో సంబంధం ఉందని తెలుస్తుంది.ఇంతకీ ఆ మిషన్ కి తన అన్నశివ (సత్యదేవ్)కి సంబంధం ఏంటి ? ,చివరికి సూరి , శివను ఎలా మళ్లీ కలుసుకున్నాడు అనేదే ఈ కింగ్డమ్ కథ.

విశ్లేషణ :

కింగ్డమ్ ని ఒక ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా తను అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీద తీసుకరావడంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సక్సెస్ అయ్యాడు. ఎక్కడా అనవసరమైన ఎలివేషన్ లు లేకుండా తను చెప్పాలనుకున్న కథను డిటైల్డ్ గా చెప్పాడు. అన్నదమ్ముల ఎమోషన్ సినిమాకు మెయిన్ సోల్. దీన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేశాడు. ఇందులో మెయిన్ గా మూడు పాత్రలు సూరి ,సత్య ,మురుగన్ సినిమాకు బలంగా నిలిచాయి.వీటిని చూపించిన విధానం చాలా బాగుంది.

కింగ్డమ్ వరల్డ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టినా ఆ తరువాత అందులోని పాత్రలతో ట్రావెల్ చేస్తాం.విజయ్ ఇంట్రో సీన్ కూడా సూపర్ అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు ,ఇంట్రెస్టింగ్ డ్రామా తో ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా బాగుందనిపిస్తుంది.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. సెకండ్ హాఫ్ కూడా అంచనాలను అందుకొని సూపర్ అనిపిస్తుంది.అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీల్ తెప్పించినా ఎండింగ్ మాత్రం అదిరిపోతుంది. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ను బాగా డీల్ చేశాడు దర్శకుడు. ఓవరాల్ గా కింగ్డమ్ విజయ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా. విజయ్ కి ఇది పర్ఫెక్ట్ కం బ్యాక్ అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే సూరి పాత్రలో విజయ్ అదరగొట్టాడు.అర్జున్ రెడ్డి తరువాత మళ్ళీ అలాంటి నటన తో ఆకట్టుకున్నాడు విజయ్.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన కట్టిపడేసింది.తనకు సరైన స్టోరీ పడి సరైన దర్శకుడు దొరికితే ఎలా ఉంటుందో ఈసినిమాతో చూపించాడు. ఈ ఇంటెన్సివ్ రోల్ విజయ్ కి మరింత మంది అభిమానులను తెచ్చిపెడుతుంది.ఇక సూరి తరువాత సత్య ,మురుగన్ పాత్రలు సినిమాకు మెయిన్. అందులో సత్య పాత్రలో సత్యదేవ్ చాలా బాగా చేశాడు.సహజమైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు.తన కెరీర్ లోనే ఈ రోల్ హైలైట్ అని చెప్పొచ్చు.చాలా రోజుల తరువాత సత్యదేవ్ కి మంచి పాత్ర దొరికింది. అలాగే మురుగన్ రోల్ కూడా సినిమాకు హైలైట్.ఈరోల్ లో వెంకటేష్ నటన అదుర్స్ అనిపించింది. ఈసినిమా తరువాత తనకు వరుస ఆఫర్లు రావడం ఖాయం. హీరోయిన్ గా భాగ్య శ్రీ స్క్రీన్ మీద బాగా కనిపించింది.

డైరెక్టర్ గౌతమ్ కి టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ టీం దొరికింది.అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. బీజీఎమ్ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అనవసరమైన సెట్ ల జోలికి పోకుండా లైవ్ లొకేషన్లలో షూట్ చేయడంతో సినిమా అంత రియల్ గా అనిపించింది.ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.ఈసినిమా కోసం నిర్మాతలు ఫస్ట్ అనుకున్నదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టారు. అది వృధాగా పోలేదు.

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ ఆ అంచనాలను అందుకొని  విజయ్ పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చింది.ఇందులో విజయ్, సత్య దేవ్ , వెంకటేష్ నటన ,ఫస్ట్ హాఫ్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.సో ఫైనల్ గా  అందరికి కనెక్ట్ అయ్యేలా ఉండి థియేటర్లలో ఒక సారి చూడదగ్గ సినిమా కింగ్డమ్ అని చెప్పొచ్చు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.