హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.హిందీ వెర్షన్ తోపాటు ఒకేసారి తెలుగు ,తమిళ వెర్షన్ల సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఊపిరి ఊయలగా అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది.ఇటలీలో అందమైన లొకేషన్ల లలో హృతిక్ ,కియరా అద్వానీ లపై ఈ సాంగ్ ను చిత్రీకరించారు.సినిమా రిలీజ్ కి ముందే ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇందులో మరో సాంగ్ కూడా ఉండనుంది.ఈ సాంగ్ ను హృతిక్ , ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.ఎన్టీఆర్ ఈసినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు దాంతో హిందీతోపాటు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ భారీ ధరకు వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న విడుదలకానుంది.అయితే అదే రోజున తమిళ మూవీ కూలీ కూడా విడుదలవుతుంది.ఈసినిమా కూడా అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. దాంతో తమిళ్ ,తెలుగులో వార్ 2కి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























