ఉస్తాద్ భగత్ సింగ్ లో సెట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసింది కింగ్డమ్ టీం.ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ అన్నుపూర్ణ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇకక నిన్న కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చిన కింగ్డమ్ టీం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ,నిర్మాత నాగవంశీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ ను విజిట్ చేసి పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రేపు కింగ్డమ్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్, కింగ్డమ్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన కింగ్డమ్ కి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.సినిమా అదిరిపోయిందని ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ దేవరకొండ కం బ్యాక్ ఇచ్చాడని సోషల్ మీడియా లో రివ్యూస్ ఇస్తున్నారు.హిట్ టాక్ రావడంతో మొదటి రోజు ఈసినిమా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.ప్రస్తుతం పోటీ లేకపోవడంతో ఫుల్ రన్ లో కింగ్డమ్ 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























