హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా తమ్ముడు.ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈసినిమా ఈనెల 4న థియేటర్లలోకి వచ్చి అంచనాలను అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఆగస్టు 1నుండి తెలుగు ,తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకు రానుంది.మరి ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో లయ రీ ఎంట్రీ ఇవ్వగా సప్తమి గౌడ ,వర్ష బొల్లమ్మ ,దిత్య కీలక పాత్రల్లో నటించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మించారు.ఈసినిమా కోసం దిల్ రాజు దాదాపు 35 కోట్ల వరకు ఖర్చు పెట్టారు.
ఇక నితిన్ నెక్స్ట్ బలగం ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మలో నటించనున్నాడు.ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.దిల్ రాజే ఈసినిమాను కూడా నిర్మించనున్నారు.మరి ఈసినిమాతోనైనా నితిన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























