ఆకాశంలో ఒక తార గ్లింప్స్ రిలీజ్

AakasamLo Oka Tara glimpse is out now

సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో తో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక నెక్స్ట్ తెలుగులో దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇందులో దుల్కర్ రైలు లో ప్రయాణిస్తూ కనిపించగా చివర్లో స్కూల్ నుండి వస్తున్న అమ్మాయిని చూపించారు.విజువల్స్ కి తోడు జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ హైలైట్ గా నిలిచింది.గ్లింప్స్ అయితే  సూపర్  అనిపించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక మారుమూల గ్రామంకు చెందిన ఓ యువకుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా వరకు తన ప్రయాణం ఎలా కొనసాగించాడు అనే కథతో వస్తుంది.ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని అనుకున్నది అనుకున్నట్లుగాతెరమీదకు తీసుకొస్తే దుల్కర్ కెరీర్ కి ఈసినిమా గేమ్ ఛేంజర్ కానుంది.పవన్ సాధినేని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గుణ్ణంసందీప్ ,గుణ్ణం రమ్య నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా కన్నా ముందు దుల్కర్ కాంత తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.రానా దగ్గబాటి ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.సెప్టెంబర్ 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.