పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ‘ది 100’ ట్రైలర్‌ లాంచ్

Power Star Pawan Kalyan Launched THE 100 Movie Trailer

ప్రముఖ బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’ జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయిన ఆర్‌కె సాగర్.. విక్రాంత్ ఐపీఎస్‌గా ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మిషా నారంగ్ తన లవ్ ఇంట్రస్ట్ గా కనిపించి కథకు రొమాంటిక్ టచ్‌ను యాడ్ చేసింది.

ట్రైలర్‌ను గమనిస్తే.. “జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం” అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే రూల్ పెట్టుకుంటాడు. కానీ ఆత్మరక్షణ కోసం, అతను తాను ఆయుధంగా చూసుకోవడం ప్రారంభిస్తాడు.”

“వ్యవస్థలోని శక్తివంతమైన వ్యక్తుల మద్దతుతో క్రూరమైన దొంగల ముఠా అతని జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదురౌతుంది. అతని సొంత డిపార్ట్మెంటర్ కూడా అతనిపై ఆరోపణలు చేసి, చివరికి అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఒకప్పుడు ఆయుధం తీసుకెళ్లనని శపథం చేసిన వ్యక్తి ఆయుధం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి వస్తాడు.”

దర్శకుడు రాఘవ్ ఓంకార్ ‘ది 100’ చిత్రాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు సస్పెన్స్, థ్రిల్స్ నిండిన ఇంటెన్స్, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, హర్షవర్ధన్ రామేశ్వర్ పవర్ ఫుల్ సంగీతం యాక్షన్‌ని మరింత ఎలివేట్ చేసింది. ఇక ఈ సినిమాకి అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ కాగా, చిన్నా ప్రొడక్షన్ డిజైనింగ్, సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్ అందిస్తునాన్రు.

మొత్తానికి ఈ ట్రైలర్ థియేటర్ రిలీజ్‌కి ముందే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. కాగా ఈ చిత్రంలో RK సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, VV గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ ముఖ్య తారాగణం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.