సతీ లీలావతి ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్

Sathi Leelavathi First Look and Motion Poster Released

నేటి కాలంలో, కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. దీనికి ప్రధాన కారణం, వ్యక్తుల మధ్య భావోద్వేగాలు లేకపోవడం వల్లనే. భావోద్వేగాలు మానవ సంబంధాలను శాశ్వతంగా నిలబెడతాయి. విభిన్న కుటుంబాలు మరియు నేపథ్యాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితంలో ప్రయాణించడానికి ఎంత బలమైన భావోద్వేగాలు ఉండాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరహా కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఇదే కోవలో దర్శకుడు తాతినేని సత్య ఈ సున్నితమైన అంశాన్ని సతీ లీలావతి చిత్రంతో హృద్యంగా తెరపైకి తెస్తున్నారు. ఇంతకుముందు ఈయన భీమిలి కబడ్డీ జట్టు మరియు SMS (శివ మనసులో శ్రుతి) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మరియు ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దేవ్ మోహన్‌ని ఒక కుర్చీలో కట్టేసి కూర్చోపెట్టి అతని ముందు లావణ్య స్పీకర్ పట్టుకుని గట్టిగా అరుస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని భావోద్వేగంగానే కాకుండా వినోదాత్మకంగా కూడా వివరించే ప్రయత్నంగా కనిపిస్తోంది. అలాగే మోషన్ పోస్టర్‌లో సైతం ఇదే థీమ్ ప్రదర్శించారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేలావుంది.

భార్యాభర్తల మధ్య బంధాన్ని భావోద్వేగంగానే కాకుండా వినోదాత్మకంగా కూడా వివరించే ప్రయత్నం సతీ లీలావతి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్-గుడ్ మూవీగా రూపొందించబడిన సతీ లీలావతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగ మోహన్ నిర్మిస్తుండగా.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.