టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను రూపొందించడం విశేషం. క్రేజీ కాంబినేషన్‌కి తోడు విడుదలకు ముందే రిలీజైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను భారీగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కుబేర చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కుబేర తొలిరోజు మంచి వసూళ్లనే కళ్లజూసింది. ఈ క్రమంలో ఓవర్సీస్‌లో సైతం అదిరిపోయే వసూళ్లు అందుకుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు అత్యధిక ఆదరణ దక్కే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనమే సృష్టించింది.
900K డాలర్లకి పైగా గ్రాస్ సాధించింది. మాములుగానే శేఖర్ కమ్ముల సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆయన మూవీస్ అన్ని క్లాస్‌గా ఉండటంతో అమెరికా సహా ఇతర దేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను బాగా ఇష్టపడుతుంటారు. అంటే 1 మిలియన్‌కి దగ్గరలో నిలిచింది. ఇక ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో ఈజీగా 2 మిలియన్ మార్క్ అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాగా కుబేరలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ తన నటనతో అదరగొట్టేశాడు. ఆయనపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల కురిపిస్తున్నారు. మరోవైపు సీబీఐ ఆఫీసర్‌గా నాగార్జున, కథానాయికగా రష్మిక తమ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ని మురిపించారు. తనకంటూ ఎవరూలేని ఒక బిచ్చగాడు, జైలు పాలైన నిజాయితీ పరుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి, దేశంలోనే సంపన్నుడైన ఓ వ్యాపారవేత్త.. ఈ ముగ్గురు మధ్య నడిచే డ్రామాను చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: