పరభాషా హీరోలతో సూపర్ హిట్స్ కొడుతున్న తెలుగు డైరెక్టర్స్

Telugu Directors Makes Super Hits With Other Language Heroes

గత కొన్నేళ్లుగా పలు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాయి. ఇక్కడి హీరోలు, దర్శకులకు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది. మరోవైపు ఈ ట్రెండ్ మొదలయ్యాక అన్ని ఇండస్ట్రీలలోని హీరోలు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ఒకరికొకరు కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కుబేర’ ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అయితే తెలుగు డైరెక్టర్ రూపొందించిన ఈ మూవీలో హీరో పాత్రను పోషించిన ధనుష్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందివాడు కావడం విశేషం. ఈ విషయమై కోలీవుడ్ డైరెక్టర్లపై తెలుగు నెటిజన్స్ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు.

ఇంతకుముందు తమిళ దర్శకులు మన తెలుగు హీరోలతో చేసిన సినిమాలు నిరాశపరిచాయి. కానీ అదే సమయంలో కోలీవుడ్ హీరోలతో తెలుగు డైరెక్టర్స్ చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ ఈ విషయయంపై పోలిక తెస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు వారు పలు ఉదాహరణలు చూపుతున్నారు కూడా. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

వెంకీ అట్లూరి ఇటీవలికాలంలో ధనుష్‌తో ‘సార్’ తీసి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్‌గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇక అంతకుముందు వంశీ పైడిపల్లి నాగార్జున-కార్తితో ‘ఊపిరి’ తీసి సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాను నడిపించేది కార్తి పాత్రే. ఆయన తమిళ హీరోనే. ఆ తర్వాత విజయ్‌తో ‘వారసుడు’ తీసి హిట్ కొట్టాడు.

ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ముల కుబేరతో ధనుష్‌కి హిట్ మూవీ అందించినట్టయింది. ఈ క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రంలో తమిళ్ హీరో విజయ్ సేతుపతితో చేస్తున్నాడు. దీనిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇదిలావుంటే, మరోవైపు తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలకు మాత్రం డిజాస్టర్స్ అందించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మహేష్ బాబుతో ‘స్పైడర్’తో ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చాడు.

అలాగే ఇంకో డైరెక్టర్ లింగుస్వామి, ‘వారియర్’ సినిమాతో రామ్ పోతినేని డిజాస్టర్ అందించాడు. ఇక ‘కస్టడీ’ చిత్రంతో నాగచైతన్యకు భారీ ఫ్లాప్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. వీటన్నింటికన్నా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో రామ్ చరణ్‌కి ఈ ఏడాది పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ఇక గతంలోకి వెళ్తే, ఎన్టీఆర్‌కి ‘నాగ’తో డీకే సురేష్, పవన్ కళ్యాణ్‌కి ‘బంగారం’తో ధరణి మరిచిపోలేని అట్టర్ ఫ్లాప్ చిత్రాలు ఇచ్చారు.

ఒకటి, రెండు కాదు.. తమిళ్ డైరెక్టర్స్ మన హీరోలతో తీసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. అందుకే నెటిజన్స్ కోలీవుడ్ డైరెక్టర్లను ట్రోల్ చేస్తున్నారు. మన డైరెక్టర్స్‌కి తెలిసినట్టుగా కోలీవుడ్ మేకర్స్ ప్రేక్షకుల నాడి పట్టుకోలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఫ్యూచర్ లో అయినా ఈ లెక్కను తమిళ దర్శకులు సరిచేస్తారేమో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.