పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్ బుక్ మై షో లో ఇప్పటికే 200K పైగా ఇంట్రెస్ట్స్ అధిగమించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే పలుసార్లు పోస్ట్‌పోన్ అయిన హరిహర వీరమల్లు సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్టు తాజాగా వెల్లడించింది.
అయితే ఇంతకుముందు హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరక్కుతున్న కారణంగా భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఉన్నందున అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో తప్పనిసరై సినిమాను పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఫైనల్ డేట్ ఫిక్స్ చేయడంతో పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నెలకొంది. దీంతో వారు ఇప్పటినుంచే వీరమల్లుని బిగ్ స్క్రీన్ పైన వీక్షించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: