నా సామి రంగ తరువాత సీనియర్ స్టార్ హీరో నాగార్జున హీరోగా కాకుండా రెండు సినిమాల్లో నటించాడు.అందులో ఒకటి కుబేర కాగా మరొకటి కూలీ.ఈ రెండిట్లో నాగార్జున ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు.ఇందులో నాగార్జున చేసిన పాత్రలు వేటికవే డిఫ్రెంట్.ఇక కుబేరలో నాగ్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నాడు. ఈసినిమా ఈనెల 20న విడుదలకానుంది.శేఖర్ కమ్ముల ఈసినిమాను డైరెక్ట్ చేయగా ధనుష్ ,రష్మిక మందన్న జోడిగా నటించారు.ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున కూలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కూలీలో చాలా కీలకమైన పాత్ర చేశాను.లోకేష్ నన్ను అద్భుతంగా చూపించాడు.నాకు షాట్స్ చూపించినప్పుడు అందులో వుంది నేనే నా అని అనుకున్నా అంత బాగా తీశాడు.రజినీ సార్ ది పక్కన పడితే నాది అలాగే కన్నడలో ఉపేంద్ర ,హిందీలో అమీర్ ఖాన్ చేసిన రోల్స్ సినిమాలో స్టాండ్ అవుట్ గా నిలుస్తాయి. ఈమూడు పాత్రలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ నాగ్ చెప్పుకొచ్చాడు.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఆగస్టు 14న ఈసినిమా విడుదలకానుంది.
ఇక నాగార్జున సోలో హీరోగా ఇప్పటివరకైతే మరో సినిమాకు ఓకే చెప్పలేదు.అయితే ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథ నాగ్ కు బాగా నచ్చిందట. మరి ఆ దర్శకుడితోనే నాగ్ తరువాతి సినిమా చేస్తాడో లేక వేరే వారికీ ఎవరైనా ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: