కన్నప్ప ట్రైలర్ రిలీజ్

Kannappa Trailer Released, Vishnu Manchu Mesmerizes With His Performance

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే కన్నప్ప నుండి క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్, టీజర్, నాలుగు పాటలను రిలీజ్ చేయగా ఇవన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే వాస్తవానికి నిన్నే ఈ ట్రైలర్ రావాల్సివుండగా, ముందురోజు అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటన కారణంగా నేటికి వాయిదావేశారు మేకర్స్. ఈ క్రమంలో నేడు కన్నప్ప ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ అయితే సూపర్‌గా కట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. కన్నప్పగా విష్ణు మంచు పరకాయప్రవేశం చేసినట్టు కనిపిస్తోంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్, ప్రత్యేక పాత్రలో ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. హీరోయిన్‌ ప్రీతి ముఖుంధన్ తన అందంతో కట్టిపడేసింది. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ మోహన్ లాల్ పాత్రలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక టెక్నికల్ విషయానికొస్తే.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. స్టీఫెన్ దేవస్సీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్‌కి పురాణాలపై మంచి పట్టు ఉందని అర్ధమవుతోంది. నటీనటులు, క్యారెక్టర్స్ డిజైనింగ్, సాంకేతికత కలగలిపి ఓ విజువల్ వండర్ సృష్టించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

కాగా కన్నప్ప చిత్రంలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు పేరొందిన డిష్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కేరళలో ఈ సినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా.. తమిళంలో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేయనుంది. తెలుగులో కూడా బడా సంస్థలే రిలీజ్ చేయనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.