ఈనెలలో మచ్ అవైటెడ్ మూవీ గా వస్తుంది కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కడం ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున కలిసి నటించడంతో ఈసినిమాపై అంచనాలు వున్నాయి.పోస్టర్స్ అయితే సినిమా హైప్ ను పెంచేస్తున్నాయి.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఇందులోనే ట్రైలర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ ఈవెంట్ ను వాయిదా వేశారు.ఇక ఈనెల 15న అదే వేదిక లో ఈప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ మాత్రం రేపే విడుదలచేయనున్నారు.ఈ ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్లుగా ఉంటే కుబేర భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.తన శైలికి భిన్నంగా శేఖర్ కమ్ముల ఈసినిమాను తెరకెక్కించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.100కోట్లకుపైగా బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ నిర్మించాయి.ఈనెల 20న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఇక గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది.ఈవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి విడుదలకావడం లేదు. అయితే వచ్చే వారం కుబేర తోపాటు 8వసంతాలు రిలీజ్ కానుంది.మరి ఈరెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























