క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. తొలిరోజు ఏకంగా 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్‌ను రాబట్టి చరిత్ర సృష్టించడమే కాకుండా టోటల్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా రూ. 1,871కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే తాజాగా పుష్ప 2 మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈసారి బుల్లితెరపై మెరిసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ జీ సినిమాలో రికార్డు స్థాయిలో 5.1 టీఆర్పీ రేటింగ్‌తో 5.4 కోట్ల వ్యూయర్‌షిప్‌ను దక్కించుకుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇలా విడుదలైన 7 నెలల తర్వాత ఒక డబ్బింగ్ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్‌లో ఈ రేంజ్‌లో హిట్ అవ్వడం అంటే మామూలు విషయంకాదు. ఇక కొన్ని రోజుల క్రితం పుష్ప 2 తెలుగు వెర్షన్ ‘స్టార్ మా’లో మొదటి సారి ప్రదర్శించగా 12.61 టీఆర్పీని రాబట్టుకుంది.
కాగా థియేటర్లలో సైతం ఈ చిత్రం హిందీ వెర్షన్ కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం హిందీ వెర్షన్‌లో 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది. తద్వారా అక్కడ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్ము రేపి కళ్ళు చెదిరే వసూళ్లను అందుకుంది. ప్రధానంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనమే సృష్టిచింది. 15 మిలియన్లకు పైగా కలెక్షన్స్ కళ్లజూసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్‌కు కాసుల వర్షం కురిపించింది. అయితే ఓవరాల్‌గా మాత్రం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ 2,000 కోట్లతో మొదటిస్థానంలోవుంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అలాగే రావు రమేష్, జగపతి బాబు, అజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: