ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌కి సంబంధించి అంతా తానై వ్యవహరించే స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఇటీవల కొత్తగా ‘బీవీ వర్క్స్’ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా ‘మిత్ర మండలి’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ మరియు ఇందులో నటించే నటీనటులను రివీల్ చేశారు మేకర్స్. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ ఏర్పాటుచేసి మిత్రమండలి థియేట్రికల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్ అయితే హిలేరియస్‌గా ఉంది. ఫన్, మిస్టరీ జానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్నటు అర్థమవుతోంది. ప్రియదర్శి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. సూపర్ హిట్ ‘కోర్ట్’ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ‘కమిటీ కుర్రాళ్ళు’ తర్వాత ప్రసాద్ బెహరాకి మరో మంచి పాత్ర దొరికినట్టు అనిపిస్తోంది. నిహారిక స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేలావుంది.
కాగా మిత్ర మండలి చిత్రంతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: