తమిళ స్టార్ హీరో విజయ్ -ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జన నాయగన్.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.జూలై లో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకు విజయ్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డే రోజు ఈనెల 22న అప్డేట్ రానుంది.బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.ఈసినిమా కోసం విజయ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
ఇక విజయ్ కి ఈసినిమానే చివరిది కానుంది.ఇప్పటికే విజయ్ సొంతంగా పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ ని బరిలోకి దింపనున్నాడు.ఇక ఇప్పుడు జన నాయగన్ షూటింగ్ కూడా పూర్తి చేయడంతో విజయ్ పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: